ఒమిక్రాన్‌కు టాబ్లెట్‌ !

Telugu Lo Computer
0


ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కట్టడి కోసం తాము తయారు చేసిన యాంటీ వైరల్ డ్రగ్ సమర్థవంతంగా పని చేస్తోందని ఫైజర్ కంపెనీ ప్రకటించింది. మొత్తం 2250 మందిపై ఈ టాబ్లెట్ ను ప్రయోగించామని, అవి సత్ఫలితాలు ఇవ్వడంతో పాటు హై రిస్క్ ఉన్నవారిని కూడా ఆసుపత్రిలో చేరే ప్రమాదం నుండి తప్పించాయని వెల్లడించారు. వ్యాక్సిన్ వేసుకోలేని వారు, పెద్ద వయసు, అస్తమా, ఒబెసిటీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారిపై కూడా తమ టాబ్లెట్ ట్రయల్స్ నిర్వహించగా సత్ఫలితాలు వచ్చాయని చెప్పారు. అయితే మేరకు మెర్క్ కంపెనీ కూడా ఒమిక్రాన్ కి ఔషధంగా టాబ్లెట్స్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)