ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో రెండు రోజుల పాటు కర్ఫ్యూ విధించింది. డిసెంబర్ 11, 12 తేదీలలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఈ రెండు రోజులు ఊరేగింపులు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని వెల్లడించారు. ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా 33 ఒమిక్రాన్ కేసులుండగా, ఒక్క మహారాష్ట్ర లోనే 17 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్క రోజే ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది.
మహారాష్ట్రలో ఒకే రోజు 7 ఒమిక్రాన్ కేసులు
December 11, 2021
0