ఇరాక్ ప్రధాని నివాసంపై డ్రోన్‌లతో బాంబు దాడి

Telugu Lo Computer
0

 


ఇరాక్‌లో ముష్కర మూకలు రెచ్చిపోయాయి. ఏకంగా ప్రధాని నివాసంపైనే బాంబులతో దాడి చేశాయి. ఇరాక్‌ ప్రధాని ముస్తఫా అల్‌ కదిమి నివాసంపై డ్రోన్‌ దాడి జరిగింది. బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్‌లో ఉన్న ఆయన ఇంటిపై ఆదివారం తెల్లవారుజామున పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్‌తో దాడి చేశారు. బాగ్దాద్‌లోన అయితే ప్రధాని కదిమి సురక్షితంగా ఉన్నట్లు ఇరాక్‌ ఆర్మీ ప్రకటించింది. తాను సురక్షితంగా ఉన్నట్లు ఇరాక్‌ ప్రధాని కూడా వెల్లడించారు. ప్రజలంతా ప్రశాంతత, సంయమనంతో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ డ్రోన్ దాడిలో ప్రధాని భద్రతా సిబ్బందిలో పలువురికి గాయాలయినట్లు అధికారులు తెలిపారు. ప్రధానిని హత్య చేసేందుకు ముష్కరులు విఫలయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత ఇరాక్ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. బాగ్దాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)