నేటి నుంచి ఓటరు జాబితా సవరణ

Telugu Lo Computer
0



ఓటరుకార్డులో ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా పౌరుడిదే. అయితే.. తప్పులు లేని నిర్ధిష్టమైన ఓటరు జాబితా కోసం ఎలక్షన్ కమిషన్‌ నేడు, రేపు (నవంబర్ 27,28) ఓటరు జాబితా సవరణ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఓటరు జాబితాలో నూతన ఓటరుగా నమోదు మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం కల్పించారు.  ఈ ప్రత్యేక క్యాంపెయిన్ ను అందరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ తెలిపారు. జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తయిన వారు నూతన ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారి సూచించారు. 2021 సంవత్సరపు ముసాయిదా ఓటరు జాబితాను భారత ఎన్నికల సంఘం నవంబర్ 1వ తేదీన విడుదల చేసింది. ఈ జాబితాలో పేరు మార్పు, అడ్రస్ మార్పు, తదితర మార్పులు, చేర్పులు ఈ ప్రత్యేక క్యాంపెయిన్ సందర్భంగా చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం మీ సమీప పోలింగ్ బూత్ లో ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారి అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునే వారు ఫారం 6 నింపాలి. ఆ దరఖాస్తును అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఓటరు జాబితాలో పేరు తొలగింపునకు ఫారం-7, తప్పుల సవరణకు ఫారం-8, ఒకే నియోజక వర్గంలో మార్పుకు ఫారం-8A ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)