నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనల్లో భాగంగా రైతులు హర్యానాలో బిజెపి బహిరంగ కార్యక్రమాలను అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా జజ్జర్‌లోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. అడ్డుగా ఉన్న బారికేడ్లపై నుండి దూకి వేదిక వద్దకు వెళ్లేందుకు రైతులు యత్నించారు. చౌతాలా జజ్జర్లోనే మరో కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్లాల్సి వుంది. చౌతాలాను అడ్డుకునేందుకు యత్నించిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. గురువారం కూడా కర్నాల్‌లోని బహిరంగ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు.