వివాహమైన నెల రోజులకే.....!

Telugu Lo Computer
0


భార్యను హత్య చేసిన భర్త ఆపై ఆత్మహత్యకు యత్నించిన ఘటన హైదరాబాద్‌ లోని  బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం అర్ధరాత్రి సమయంలో  కిరణ్‌ ఆయన భార్య సుధారాణి (20)ని గొంతుకోసి హత్య చేసి, అనంతరం తాను చేయి కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. నెల రోజుల క్రితమే వీరి వివాహం జరిగింది. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి సుధారాణి మృతదేహం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)