కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.. అనుకున్నట్టుగానే కొద్దిరోజులుగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టింది. ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు, ఫిర్యాదులను పట్టించుకోకుండా శ్రీశైలం, సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం.. పులిచింతలలోనూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. విద్యుత్ ఉత్పత్తి చేసిన అనంతరం నీటిని దిగువకు విడుదల చేస్తోంది. నాలుగు రోజులుగా విద్యుత్ ఉత్పత్తి చేపడుతోంది. దీంతో ఏపీలోని ప్రకాశం బ్యారేజీకి వరద పెరిగింది. ప్రకాశం బ్యారేజీ పూర్తిస్థాయిలో నిండటంతో డ్యామ్‌కు సంబంధించిన 20 గేట్లు ఎత్తి 8500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ ఉత్పత్తి నిర్ణయంతో పులిచింతల ప్రాజెక్ట్ సగానికిపైగా ఖాళీ అయ్యింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి పులిచింతల నుంచి వస్తున్న నీటిని.. వచ్చింది వచ్చినట్టుగా సముద్రంలోకి వదలుతున్నారు. తెలంగాణ చర్యలతో ఎగువ ప్రాజెక్టులు నిండకుండానే సముద్రంలోకి కృష్ణా నీరు వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Post a Comment
0Comments
3/related/default