మాజీ భార్యే సవతి తల్లి !
July 05, 2021
0
ఉత్తర్ప్రదేశ్ బదాయూ జిల్లాలో కొడుకు నుంచి విడాకులు తీసుకున్న భార్య తండ్రిని పెళ్లి చేసుకుంది. అప్పటివరకు తన భార్యగా ఉన్న ఆమె, ఇప్పుడు సవతి తల్లి అయ్యింది. 2016లో సంబంధిత ఒక వ్యక్తికి ఓ అమ్మాయితో వివాహమైంది. అప్పటికి వారిద్దరూ మైనర్లే. కాగా 6 నెలల తర్వాత అభిప్రాయ బేధాలు వచ్చి వారిద్దరూ విడిపోయారు. ఆమెతో తిరిగి కలిసి జీవించేందుకు అతను ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అతనొక తాగుబోతని, తనకు విముక్తి కావాలని చెప్పి ఆమె విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి అతని తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. వెంటనే జిల్లా పంచాయతీ అధికారులను ఆశ్రయించాడు. తన తండ్రి వివరాలు సేకరించాలని ఆర్టీఐ దాఖలు చేశాడు. ఆ 48 ఏళ్ల తండ్రి, కొన్నేళ్ల క్రితం కొడుకు పెళ్లిచేసుకున్న అమ్మాయిని తిరిగి వివాహమాడి, సంభాల్ ప్రాంతంలో కలిసి జీవితం సాగిస్తున్నాడని తెలిసి ఆ కొడుకు షాక్కు గురయ్యాడు. అనంతరం బిసౌలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు వారిద్దరిని పిలిచి మాట్లాడారు. మహిళా మాత్రం రెండో భర్తతోనే సుఖంగా ఉన్నట్టు తెలిపింది. మొదటి భర్త దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదని పోలీసులకు తెలియజేసింది.