పనస పండు శరీరంలోని గ్లూకోస్, ఇన్సులిన్, గ్లెసెమిక్ స్థాయులను నియంత్రిస్తుంది. ఫలితంగా రక్తంలోని చక్కెర నిల్వలు నియంత్రణలో ఉండి, మధుమేహం రాకుండా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
✺ పచ్చి పనస కాయలో యాసిడ్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు రోజూ తీసుకునే కార్బోహైడ్రేట్స్ స్థానంలో పనస పండ్లను తీసుకోవచ్చు. ముఖ్యంగా రైస్‌కు బదులు పనస పండ్లను తిన్నట్లయితే. చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
✺ పనస పండులో ఉండే సహజసిద్ధ చక్కెర్లు, ఫైబర్ ఉంటాయి. మధుమేహం రోగుల రక్తంలోని చక్కెర స్థాయిలను పనస స్థిరంగా ఉంచుతుంది. అలాగే, మధుమేహం రాకుండా నియంత్రిస్తుంది.
✺ పనన పండు గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని తిన్నట్లయితే అజీర్తి సమస్యలు దూరమవుతాయి.
✺ ఏదైనా సరే మితంగా తినాలి. ఇన్ని ప్రయోజనాలు ఇస్తుందనే ఉద్దేశంతో అతిగా ఈ పండును తింటే కొత్త సమస్యలు వస్తాయి.
✺ పనస పండు వల్ల సుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయనే ఉద్దేశంతో ఔషదాలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపొద్దు. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే న్యూట్రీషియన్లు లేదా వైద్యుల సూచన తీసుకోండి.
❂ పనస పండుతో గుండెపోటును దూరం చేసుకోవచ్చు.
❂ పనసలో యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్-C, పనసలో విటమిన్-A పుష్కలంగా ఉంటాయి.
❂ పెద్ద ప్రేగు (కోలన్) క్యాన్సర్‌ను దూరం చేసే యాంటీ-యాక్సిడెంట్లు ఈ పండులో ఉన్నాయి.ః
❂ ఆస్తమాను తొలగించి, ఎముకలకు బలాన్నిస్తుంది.
❂ అనీమియాను దూరం చేస్తుంది.
❂ పనసలోని విటమిన్-A మెదడు నరాలను బలపరుస్తుంది.
❂ పనసలో ఉండే పొటాషియం మధుమేహాన్ని, గుండెపోటును నియంత్రిస్తుంది.
❂ పనస అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది.
❂ పనస కంటి దృష్టిని మెరుగు పరుస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
❂ వీర్యవృద్ధికి పనస పండు సహకరిస్తుంది.
❂ వాత, పిత్త వ్యాధులు నయమవుతాయి.
❂ పనసలోని ఫైబర్ పైల్స్‌ను నివారిస్తుంది.
❂ పనస లేత తొనల్ని వేయించి తీసుకుంటే పిత్తం తొలగిపోతుంది.
❂ పనస పండులో ఉండే ఐరన్ రక్తహీనత నివారిస్తుంది.

