ఆశే శ్వాస!

Telugu Lo Computer
0


వెంకట్రావు ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యా డు.వయసు 76 సంవత్సరాలు. పుల్ పెన్షను వస్తోంది.

రెండు నెలల క్రితం చాలా అనారోగ్యం చేసింది. డాక్టర్లు లాభం‌లేదన్నారు. అయినా ఓ నాలుగు రోజులున్నాక ఇంటికి పంపించేస్తాం. ఇక  ప్రాణం  పోయేదాక జాగ్రత్తగా చూసుకోండి, మరో రెండు రోజులయ్యాక కావల్సిన వారికి కబురు పెట్టుకోండి అన్నారు.

హాస్పటల్ మంచంలో అచేతనంగా పడిఉన్నాడు‌వెంకట్రావు.

సాయంకాలం 6 గంటలయింది.

ఏదో టీవీ ఛానల్లో‌వార్తలు వింటున్నాడు తండ్రి మంచము పక్కనే ఉన్నాడు పెద్దకొడుకు.

ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభ‌వార్త

సర్కారు ఆమోదం తెలిపిన పేరివిజన్. 36 వాయిదాలలో బకాయిలు.....  కంగుమని చదువుతోంది. వెంకట్రావు చేతి వేళ్ళలో కదలిక. వెంటనే పరుగెత్తుకొచ్చిన డాక్టర్లు.

అనూహ్యంగా కోలుకున్నాడు వెంకట్రావు. ఓ వారం తదుపరి ఇంటికి పంపించేశారు. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా వాకర్‌ సహాయంతో నడుస్తున్నాడు.

నిన్ననే కొలీగ్ కి ఫోన్ చేసి పీఆర్స్సీ,

బకాయిలు,36 వాయిదాల గురించి మాట్లాడి ఆనంద పడ్డాడు హమ్మయ్య ఇంకొంతకాలం  దాక‌ భయంలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)