చుక్కల మందుపై తీర్పు రిజర్వ్

Telugu Lo Computer
0


ఆనందయ్య కంటిలో వేసే  చుక్కల  మందుపై తీర్పును ఆంధ్రప్రదేశ్  హైకోర్టు రిజర్వ్ చేసింది. నిపుణుల కమిటీ నివేదిక వచ్చేందుకు మూడు వారాల సమయం కోరిన మీదట, నిపుణుల ఆమోదం లేనిదే అనుమతి ఇవ్వలేమని హైకోర్టు  తెలిపింది. అత్యవసరం ఉన్న వారికి కంటి మందు అనుమతిస్తారా అని కోర్ట్ ప్రశ్నించగా, అప్పుడు అందరూ అత్యవసరం అని వస్తారని ప్రభుత్వం తెలిపింది. చుక్కల  మందు కోసం రోజుకు 15 నుండి 20 మంది మాత్రమే వస్తున్నారని ఆనందయ్య తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. ఆనందయ్య  మందు వ్యతిరేకించడం లేదని, చుక్కల మందు మినహా మిగతా వాటి పంపిణీకి ప్రభుత్వం అనుమతించిందని, ప్రభుత్వ న్యాయవాది కోర్టుకి తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)