కరోనా వైరస్ వల్ల ప్రభావితమైన చిన్నారుల సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని తెలియజేస్తూ కేంద్ర మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి రామ్ మోహన్ మిశ్రా అన్ని రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులకు లేఖ రాశారు. అన్ని రాష్ట్రాలు, కలెక్టర్లు, పోలీస్, పంచాయితీరాజ్‌తో పాటు పట్టణ స్థానిక సంస్థలు ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.* కరోనాతో తల్లిదండ్రులను కోల్పోవడంతో కుంగుబాటులో ఉన్న చిన్నారులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేపట్టాలి. ఇలాంటి ప్రతి చిన్నారి ప్రొఫైల్‌తో పాటు వారి అవసరాలను డేటాబేస్‌లో పొందుపరచాలి. అనంతరం వాటిని ట్రాక్ చైల్డ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.
* కరోనా వైరస్ వల్ల తల్లిదండ్రులు అనారోగ్యంపాలైతే.. అలాంటి వారికోసం తాత్కాలికంగా చైల్డ్ కేర్ కేంద్రాలను (CCIs)ను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా సంరక్షకులు లేని చిన్నారులకు అవసరమైన సహాయాన్ని అందించాలి.
* ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వారి చిన్నారుల బాధ్యతను చూసుకునే కుటుంబసభ్యుల నమ్మకస్తుల వివరాలను తీసుకోవాలి. ఇందుకోసం ఆసుపత్రిలో చేరిక సమయంలో నమోదు చేసుకునే వివరాలతోపాటు వీటిని కూడా ఆసుపత్రి సిబ్బంది నమోదుచేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ సూచించింది.
* కుంగుబాటులో ఉన్న చిన్నారులను పిల్లల సంరక్షణ సేవా పథకం కింద ఇప్పటికే అందుబాటులో ఉన్న కేంద్రాలో తాత్కాలికంగా వసతి కల్పించేలా చర్యలు చేపట్టాలి.
* కొవిడ్‌తో బాధపడుతున్న చిన్నారులకు చైల్డ్ కేర్ కేంద్రాల్లోనే (CCIs) ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆయా కేంద్రాలను సందర్శించి, చిన్నారులతో సంభాషించే మానసిక నిపుణులు, కౌల్సిలర్ల జాబితాను సిద్ధం చేయాలి.
* కుంగుబాటులో ఉన్న చిన్నారులను మానసికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు స్థానికంగా హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించాలని రాష్ట్రాలకు సూచించింది. వీటిలో మానసిక నిపుణులు అందుబాటులో ఉంచాలి.