కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని మందపాడులో నివసించే చుక్కా లక్ష్మి అనే మహిళకు శనివారం ప్రభుత్వం ఆర్థిక సాయంగా అందిస్తున్న జగనన్న చేయూత డబ్బులు వచ్చాయి. లక్ష్మి కోడలు స్వరూప ఆ డబ్బులు తనకు ఇవ్వాలని అడిగింది. అయితే అత్త లక్ష్మి అందుకు నిరాకరించింది. దాంతో అత్తమీద కోపం పెంచుకున్న కోడలు స్వరూప అదివారం ఉదయం నిద్రపోతున్న అత్తపై వేడి నూనె పోసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అత్తను గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లక్ష్మి కోడలు స్వరూప, కొడుకు శివను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
Post a Comment
0Comments
3/related/default