విద్యుత్ కార్ల తయారీలో దిగ్గజమైన అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఎలక్ట్రికల్ వాహనాల సంస్థ టెస్లా 2,85,000 విద్యుత్ వాహనాలను చైనాలో రీకాల్ చేసింది. క్రూజ్ కంట్రోల్ వ్యవస్థలో సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ఈ వ్యవస్థ ఆటోమెటిక్ గా ఆన్ అవుతుంది. దీనితో వాహనం వేగం ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇది భద్రతాపరమైన సమస్యగా మారిందని చైనా అధికారులు చెబుతున్నారు. ఈ రెండు మోడళ్లను కొనుగోలు చేసిన వారు తమ వాహనాలను అప్‌గ్రేడ్ చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ కారణంతోనే రీకాల్ చేసినట్లు స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీ టెస్లా.ఎలక్ట్రానిక్ వాహనాలను తయారు చేయడంలో టాప్ ఆటొమొబైల్ కంపెనీగా పేరు సాధించింది. చైనాలో ఈ కంపెనీ యూనిట్లు ఉన్నాయి. మోడల్ 3, మోడల్ వై కార్లు చైనాలోనే తయారయ్యాయి. మోడల్ 3 కారు ధర భారత్‌లో 60 లక్షల రూపాయలు ఉంటోంది. కాగా. మోడల్ వై ప్రైస్ 50 లక్షలకు పైమాటే.
Post a Comment
0Comments
3/related/default