వృద్ధుని ఆత్మహత్య

Telugu Lo Computer
0


సిద్ధిపేట జిల్లా మల్లన్న సాగర్ ముంపు గ్రామం వేములాఘాట్ లో విషాదం చోటుచేసుకుంది. ముంపులో తమ గ్రామం పూర్తిగా పోతుందన్న ఆవేదనతో ఓ  వ్యక్తి తన ఇంట్లోనే చితి పేర్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది.  కూలగొట్టిన తన ఇంటి ఆవరణలోనే చితి  పేర్చుకుని తుటుకూరి మల్లారెడ్డి (70) అనే వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసి  ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చితిలో మిగిలిన శరీర భాగాలను పోస్టుమార్టానికి పంపించారు.  వృద్ధుని ఆత్మహత్యకు గల కారణాల మీద దర్యాప్తు ప్రారంభించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)