సౌథాంప్టన్ వేదికగా జరగనున్న ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బరిలోకి దిగే 11 మంది సభ్యుల టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ కాగా, అజింక్యా రహానె వైస్ కెప్టెన్‌గా, ఆరుగురు బ్యాట్స్‌మెన్, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగబోతోంది. స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఇద్దరూ బ్యాటింగ్ చేసే అవకాశం ఉండటంతో మేనేజ్‌మెంట్ తుది జట్టులో వారికి చోటు కల్పించింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్‌గిల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె (వై.కె) రిషభ్ పంత్(వి.కీ), రవీంద్ర జడేజా, అశ్విన్, బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ.
