జూడాలతో చర్చలు సఫలం!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ డాక్టర్లు చర్చలు సఫలం అవ్వడంతో  చేపట్టిన సమ్మె విరమించారు. వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని, ఆ శాఖ ముఖ్య కార్యదర్శితో జూడాల సంఘం నాయకులు జరిపిన చర్చలు ఫలించాయి. స్టైఫండ్ 15 శాతం పెంచాలని జూడాలు డిమాండ్ చేయగా, ప్రభుత్వం అంతకంటే ఎక్కువే పెంచాలని యోచిస్తోందని, ముఖ్యమంత్రిని కలసి తుది నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి ఆళ్ల నాని వారికి వెల్లడించారు. ఇక బీమా, ప్రోత్సాహకాల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని జూడాల సంఘ నేతలు వెల్లడించారు. తమకు రక్షణ కల్పించే విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో జూడాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు.

కరోనా రోగులకు వైద్యం చేస్తూ జూడాలు కరోనా బారిన పడితే, వారికి ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చినట్లు జూడాలు చెప్పారు. కరోనా పాండమిక్ సమయంలో సమ్మె విరమించాలని, ఈ సమయంలో సమ్మెకు దిగితే పేద ప్రజలు ఇబ్బందులు పడతారని మంత్రి జూడాలకు విజ్ఙప్తి చేశారు. దీనికి వారు కూడా సానుకూలంగా స్పందించారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)