నెటిజన్లపై సనూష ఆగ్రహం

Telugu Lo Computer
0


బాలనటిగా తెరంగేట్రం చేసి నటిగా ప్రేక్షకుల్ని అలరించిన మలయాళీ భామ సనూష నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "నన్ను అనే ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి.. మీరేం ఫర్‌ఫెక్ట్‌ కాదు" అంటూ అసహనం ప్రదర్శించింది.

ఇటీవల ఫిట్‌నెస్‌ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించి నాజుగ్గా మారింది సనూష. ఈ క్రమంలోనే తన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. దీంతో పలువురు నెటిజన్లు ఆమెపై నెగిటివ్‌ కామెంట్లు చేశారు. శరీరాకృతి గురించి అసభ్యంగా పోస్టులు పెట్టారు. వీటిపై తాజాగా సనూష స్పందించింది.

"నా శరీర బరువు గురించి నాకంటే ఎక్కువగా బాధపడుతున్న వారందరికీ చెప్పేది ఒక్కటే.. ఎదుటివాళ్ల వైపు వేలెత్తి చూపిస్తే మిగిలిన చేతి వేళ్లు మిమ్మల్నే చూపిస్తాయి. కాబట్టి, ఎదుటివాళ్లను అనే ముందు గుర్తుపెట్టుకోండి.. మీరేం పర్‌ఫెక్ట్‌ కాదు" అని ఆగ్రహం వ్యక్తం చేసింది సనూష.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)