సీజేఐ ఎన్వీ రమణకు ఘన స్వాగతం

Telugu Lo Computer
0


భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సీజేఐ హోదాలో ఎన్వీ రమణ తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చారు. ఎయిర్‌పోర్టులో ఎన్వీ రమణకు తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్యేలు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. 

ఇవాళ ఉదయం జస్టిస్‌ ఎన్వీ రమణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శనంలో సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)