విశాఖ తూర్పు నౌకాదళ స్థావరం ఆధ్వర్యంలోని నావల్ డాక్‌యార్డు, పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని మే 27న ప్రారంభించింది. నౌకాదళం, నీతి ఆయోగ్ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ కార్యక్రమం చేపట్టింది. నీతి ఆయోగ్ ఆరోగ్య సభ్యుడు డా.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వారం మొదట్లో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ (ఎంఎస్‌డీఈ) అధికారులు, విశాఖ నావల్ డాక్‌యార్డు అడ్మిరల్ సూపరింటెండెంట్ (ఏఎస్‌డీ), రియర్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రెజర్ స్వింగ్ అడ్జార్ప్‌షన్ (పీఎస్ఏ) ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్వహణపై మాస్టర్ ట్రైనర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుత మహమ్మారి సమయంలో పెరిగిన ఆక్సిజన్ డిమాండ్‌ను తీర్చడానికి దేశవ్యాప్తంగా పీఎస్ఏ ప్లాంట్లను అధిక సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
Post a Comment
0Comments
3/related/default