మందు పంపిణీకి ఓకే !

Telugu Lo Computer
0


ఆనందయ్య ఆయుర్వేద ముందు పంపిణీకి  హైకోర్టు కూడా పచ్చ జెండా ఊపింది. కంటిలో వేసే చుక్కల మందుపై గురువారం లోపు నివేదికను సమర్పించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆనందయ్య ముందుపై ఈరోజు  హైకోర్టులో విచారణ జరిగింది. చట్ట ప్రకారం మందు పంపిణీకి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని ఆనందయ్య తరపు లాయర్ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం  విచారణను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. మధ్యాహ్నం 3 గంటల తరువాత మళ్లీ విచారణను చేపట్టిన  హైకోర్టు మందు పంపిణీకి అనుమతి తెలిపింది. కంటిలో వేసే డ్రాప్స్ పై నివేదికపై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)