సౌందర్య చిట్కాలు

Telugu Lo Computer
0




* ముఖం, శరీరం నిగనిగలాడాలంటే ప్రతిరోజు ఒక  ఉసిరికాయ తినాలి. ఉసిరి శరీరానికి  నునుపునే కాక  మెరుపును  ఇస్తుంది.


* చర్మం చిట్లి బిరుసెక్కినట్లుగా ఉంటే శరీరానికి పెరుగు రాసి, అరగంట తరువాత స్నానం చేస్తే  ఆ భాద తగ్గుతుంది. 


*  చేమంతి పూవులతో   ప్రతిరోజూ  సున్నితంగా మర్థన చేస్తే కొంతకాలానికి   చర్మంపై  ముడతలు పోతాయి. 


* కోడిగ్రుడ్డు సోన, అరటి పండును బాగా కలిపి, ఆ పేస్టును తలకు పట్టించి పావుగంట తరువాత తల స్నానం చేస్తే జుట్టు నిగ నిగ లాడు తుంది. 


* పాల మీగడను సఫ్రాన్ పేస్టులో కలిపి రాత్రిపూట పడుకునేటప్పుడు మీ  పెదాలకు  ఒక   వారం రోజులు రాస్తే పెదాలు  ఎండిపోవడం గాని పగలడంకాని జరగడ. 


*  పిల్లల జుట్టు అంటుకుపోతే  కొంచం ఆలివ్ ఆయిల్నిరాసి, పావుగంట తర్వాత పొడి బట్టతో తూడుస్తే జుట్టు సరిఅవుతుంది


*  సున్నిపిండితో  సాన్నం చేస్తే  చర్మవ్యాధులు రాకుండా ఉంటమే  కాకుండా శరీరంనునుపుగా తయారవుతుంది. 


*  నీళ్ళలో కొంచెం  నిమ్మరసం కలిపి జుట్టును తలకి రాసి దువ్వుతే బిరుసుగా లేకుండా ఉంటుంది. 


* నల్లగా పెదాలకు తేనె, నిమ్మరసం, గ్లిసిరిన్లో కలిపిన మిశ్రమాన్ని రాత్రిపూట పడుకోబోయే ముందు పెదాలకి రాసి మర్థన చేస్తే పెదాల నల్లదనం పోతుంది


* ఒక కప్పు ఆపిల్ జ్యూస్, మూడు కప్పుల నీటిలో  కలిపి తలకి రాసి ఆరిన తరువాత తల స్నానం చేస్తే ఎరుపు రంగులోని జుట్టు నల్లగా మారడమే కాకుండా వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.


* పెదాలపై మచ్చలు పోవాలంటే గ్లిసిరిన్లో కొద్ధిగా రోజ్ వాటర్ కలిపి  పెదాలపై  మర్థన చేయాలి.


* పేలిన చర్మంపై  గంధం రాస్తే మంట, దురద తగ్గుతుంది. 


 

* ఎండిన  పుదీనా ఆకుల్ని పొడిచేసి, తగినంత నీరు కలిపి బాగా కాచి, చల్లార్చిన కషాయాన్ని ప్రతిరోజూ పుక్కిలిస్తే నోటి దుర్వాసన చిగుళ్ళ పగ్గులను నివారించవచ్చు.


 

*  నీటిలో నిమ్మరసం పిండి, ఆ నీటిలో చేతులు కడిగితే  మృదువుగా మారతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)