ప్రజారోగ్యం

Telugu Lo Computer
0


భారత్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఎవరికీ తెలీనిది కాదు. వాటిలో డాక్టర్లు, పడకలు, సౌకర్యాలు, మందుల కొరత సర్వ సాధారణం. వీటికి తోడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో దురుసుగా ప్రవర్తిస్తారనేది కూడా ఉంది. ఈ పరిస్థితి రెండు మూడేళ్ల ముందు నుంచే కాదు, మొదటి నుంచీ ఉంది.

దీనికి ముఖ్య కారణం ఆరోగ్య రంగంలో పెట్టుబడుల లోటు. అయితే గత ఏడాది ప్రభుత్వ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అంతకుముందుతో పోలిస్తే ఎక్కువే కేటాయించారు. ఆ కేటాయింపులు 2016-17లో సుమారు రూ. 37 వేల కోట్ల నుంచి ఇప్పుడు రూ. 65 వేల కోట్లకు పైనే చేరింది. కానీ అది ఇప్పటికీ భారత్ మొత్తం జీడీపీలో రెండు శాతం కంటే తక్కువే ఉంది.

కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా 2013-14లో ఈ గణాంకాలు 1.15 శాతం ఉండగా, అది ఇప్పుడు 1.8 శాతం అయ్యిందని చెప్పారు. ఆయన సభకు గత ఏడాది ఇచ్చిన లిఖిత జనాబులో ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి ఈ గణంకాలే ఉన్నాయని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)