దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా నిలిచారు.అదే విధంగా దేశంలోని టాప్ 10 కుబేర మహిళల జాబితాలో ఆమె అతిపిన్న వయస్కురాలిగా కూడా రికార్డు సృష్టించారు. ప్రముఖ సంస్థ 'ఎం3ఎం హురున్ ఇండియా' 2025 సంవత్సరానికిగాను విడుదల చేసిన సంపన్నుల జాబితాలో ఈ విషయం వెల్లడైంది. హురున్ ఇండియా నివేదిక ప్రకారం రోష్ని నాడార్ మల్హోత్రా సంపద విలువ ఏకంగా రూ.2.84 లక్షల కోట్లుగా ఉన్నట్లు అంచనా వేశారు. దాంతో ఆమె భారత మహిళా పారిశ్రామికవేత్తల్లో మొదటి స్థానంలో నిలిచారు. టెక్నాలజీ రంగంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న ఆమె.. దేశంలోని యువ పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
దేశంలోఅత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్ మల్హోత్రా
October 01, 2025
0
Tags