క్రికెట్‌ మ్యాచ్‌ చూసి వస్తుండగా చెట్టు విరిగి పడి యువతి మృతి : మరో ఇద్దరికి తీవ్రగాయాలు

Telugu Lo Computer
0


బెంగళూరులోని ఆచార్య మైదానంలో జరిగే శాండల్‌వుడ్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను చూడడానికి కీర్తన, ఆమె స్నేహితురాలు రాధతో స్కూటర్‌లో వెళ్లారు. మ్యాచ్‌ ముగిశాక సాయంత్రం 7 గంటల సమయంలో తమ స్కూటర్‌లో ఇళ్లకు బయల్దేరారు. కీర్తన స్కూటర్‌ వెనుక కూర్చుంది. సోలదేనహళ్లి పోలీస్‌స్టేషన్‌ సమీపంలో పెద్ద చెట్టు విరిగి పడింది. ఆ సమయంలో ఎలాంటి గాలి వాన లేవు. చెట్టు కింద నలిగిన కీర్తన క్షణాల్లోనే చనిపోయింది. రాధ, మరో బైక్‌పై వస్తున్న భాస్కర్‌ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అందరినీ స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు కీర్తన చనిపోయినట్లు తెలిపారు. మిగతా ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)