బీహార్ యువతకు అత్యధికంగా లబ్ది చేకూర్చే జాతీయ స్థాయి పథకం పీఎం సేతును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇందులో భాగంగా వెయ్యి ఐటీఐలను అప్ గ్రేడ్ చేయడం ద్వారా యువతలో నైపుణ్యాల అభివృద్ది చేయనున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలో ఉండే ఐటీఐలను ప్రపంచబ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుల సాయంతో కంపెనీలు నడిపించేలా ఈ పథకం డిజైన్ చేశారు. ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్ఫర్మేషన్ త్రూ అప్ గ్రేడెడ్ ఐటీఐస్ (పీఎం సేతు) పేరుతో ఈ పథకాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా జాతీయ స్దాయిలో వెయ్యి ఐటీఐలను బహ్ అండ్ స్పోక్ విధానంలో అభివృద్ధి చేస్తారు. ఇందులో 200 ఐటీఐల్ని హబ్ లుగానూ, మరో 800 ఐటీఐల్ని స్పోక్స్ గానూ అభివృద్ధి చేస్తారు. ఇది బీహార్ లోని యువతకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. ఈ పథకం తొలి విడతను బీహార్ లోనే ప్రారంభిస్తున్నారు. బీహార్ లోని పాట్నా, దర్భంగాలోని ఐటీఐల్ని పీఎం సేతు పథకంలో భాగంగా ముందుగా అప్ గ్రేడ్ చేస్తారు. అలాగే బీహార్‌లో పునరుద్ధరిన ముఖ్యమంత్రి నిశ్చయ స్వయం సహాయత భట్ట యోజన పథకాన్ని కూడా మోడీ ప్రారంభించారు. దీని కింద దాదాపు ఐదు లక్షల మంది గ్రాడ్యుయేట్లు రెండు సంవత్సరాల పాటు ఒక్కొక్కరికి రూ.1,000 నెలవారీ భత్యం, ఉచిత నైపుణ్య శిక్షణ లభించనుంది. దీంతో పాటు బీహార్ స్టూడెంట్ క్రెడిట్ కార్డు పథకాన్ని కూడా ప్రారంభించారు. ఇందులో చదువుకునే విద్యార్ధులకు 4 లక్షల వరకూ వడ్డీలేని విద్యారుణాలు అందుతాయి. రాష్ట్రంలో యువత సాధికారత కోసం 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తుల కోసం చట్టబద్ధమైన కమిషన్ అయిన బీహార్ యువ ఆయోగ్‌ను కూడా మోడీ అధికారికంగా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ శ్రామిక శక్తిని సృష్టించడానికి పరిశ్రమ ఆధారిత కోర్సులు మరియు వృత్తి విద్యను అందించడానికి ఉద్దేశించిన జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.
బీహార్ లో జాతీయ స్థాయి పథకం పీఎం సేతును ప్రారంభించిన ప్రధాని మోడీ !
October 04, 2025
0
Tags