పర్యాటక రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు !

Telugu Lo Computer
0


ర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ఒక మంచి స్థానంలో నిలపాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు తగ్గట్టు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలోని కొన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, దేశ విదేశీ ప్రముఖులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడానికి దృష్టి పెట్టారు. పర్యాటక రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా ఇస్తుంది. పర్యాటక రంగంలో కీలక ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలను అందించి తద్వారా పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తుంది. 2024- 2029 రాష్ట్ర పర్యాటక విధానం కింద వివిధ ప్రధాన ప్రాజెక్టులకు ఏపీ సర్కార్ ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ ప్రతిపాదనలలో అమరావతిలోని లగ్జరీ హోటళ్ళు, అరకు లోయలోని ఒక ఎకో లగ్జరీ రిసార్ట్ ఉన్నాయి. అమరావతిలో 177 కోట్ల రూపాయలతో కోర్ట్ యార్డ్ బై మారియట్ హోటల్ ను అభివృద్ధి మెస్సర్స్ సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ కు ప్రోత్సాహకాలను మంజూరు చేశారు. ఈ హోటల్స్ నిర్మాణానికి 10 సంవత్సరాల పాటు 100% నికర ఎస్ జీఎస్టీ రియంబర్స్ మెంట్ ఇస్తారు. లేదా స్థిర మూలధన పెట్టుబడి తిరిగి పొందే వరకు 10 శాతం మూలధన పెట్టుబడి సబ్సిడీని 10 కోట్లు ఇస్తారు. స్టాంప్ డ్యూటీ మినహాయింపు, ఆస్తి పన్ను ప్రయోజనాలు, పరిశ్రమల రేటు విద్యుత్తు, వంటి ప్రోత్సాహకాలను అందిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 600 మందికి ఇందులో ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు. 24 నెలలలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని భావిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా అమరావతిలో 200 కోట్ల రూపాయలతో ఫోర్ స్టార్ దస్ పల్లా హోటల్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఈ ప్రాజెక్టుతో 400 మందికి ఉపాధి లభిస్తుంది. 24 నెలల కాలంలో ఇది పూర్తవుతుందని భావిస్తున్నారు. అరకులోయలో దాదాపు 56 కోట్ల రూపాయల విలువైన పర్యావరణ రిసార్ట్ ను అభివృద్ధి చేయడానికి మెస్సర్స్ వి ఎస్ కే హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఎల్ ఎల్ పి కి ప్రోత్సాహకాలను ఇస్తున్నారు. ఈ ప్రోత్సాహకాలలో 100% ఎస్ జీఎస్టీ రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. ఐదు విడతల్లో 10కోట్ల స్థిర మూలధన సబ్సిడీని ఇస్తారు. ఐదు సంవత్సరాల పాటు విద్యుత్ చార్జీల రియంబర్స్మెంట్, సింగిల్ విండో మద్దతు ఇస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా 198 మందికి ఉపాధి దొరుకుతుంది. ఇందులో ప్రత్యక్షంగా 98 మందికి, పరోక్షంగా వంద మందికి ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా ఏపీని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రైవేటు పెట్టుబడులు పెట్టే వారికి కూడా సర్కార్ బాసటగా నిలిచి ప్రోత్సాహకాలను అందిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)