మహారాష్ట్రకు చెందిన మహిళకు జైతాపూర్ కు చెందిన బాలకృష్ణ అనే నిందితుడు ఎడపల్లి మండలం దూపల్లి గేట్ వద్ద లిఫ్ట్ ఇచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలు కోసం హత్య చేశాడు. మృతదేహాన్ని ఆటోలో తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. మృతురాలు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా, కొండల్ వాడికి చెందిన శీలంవార్ లింగవ్వ (55)గా గుర్తించారు. బతుకమ్మ పండుగ నిమిత్తం జమ్లంలోని తన కూతురి ఇంటికి వచ్చిన హత్యకు గురైంది. మహిళలు ఎవరిని పడితే వారిని నమ్మి లిప్ట్ ఎక్కి వెళ్లవద్దని.. పోలీసులు సూచించారు.
లిఫ్ట్ ఇచ్చి, బంగారు ఆభరణాలు దోచుకొని మహిళ హత్య చేసిన నిందితుడు
October 04, 2025
0
Tags