సెక్స్ వర్కర్లపై దాడి చేసి నగలు, నగదు దోచుకున్న భారతీయ టూరిస్టులు - అయిదేళ్ల జైలుశిక్ష, 12 లాఠీదెబ్బల శిక్షను విధించిన కోర్టు

Telugu Lo Computer
0


సింగపూర్‌లోని హోటల్‌లో సెక్స్ వర్కర్లపై దాడి చేసిన ఘటనలో ఇద్దరు భారతీయ టూరిస్టులకు అయిదేళ్ల జైలుశిక్ష పడింది. దాడితో పాటు దొంగతనానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. శిక్షతో పాటు ఒక్కొక్కరికి 12 లాఠీదెబ్బల శిక్ష కూడా వేశారు. నిందితులను 23 ఏళ్ల అరక్కొయిసామి డైసన్‌, 27 ఏళ్ల రాజేంద్రన్ మైలరసన్‌గా గుర్తించారు. ఆ ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు. ఏప్రిల్ 24వ తేదీన సింగపూర్‌కు ఆ ఇద్దరూ చేరుకున్నారు. రెండు రోజుల తర్వాత లిటిల్ ఇండియా ఏరియాలో వాకింగ్‌కు వెళ్లారు. ఓ అపరిచిత వ్యక్తి వారి వద్దకు వచ్చి వేశ్యలు ఉన్నట్లు చెప్పాడు. ఇద్దరు మహిళలకు చెందిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్లాడు. అయితే ప్లాన్ ప్రకారం ఇద్దరూ ఆ మహిళలను రూమ్‌కు పిలిచి వాళ్ల వద్ద నుంచి డబ్బులు లాగేసుకున్నారు. సెక్స్ వర్కర్లను దుస్తులతో రూమ్‌లో కట్టేసి, వారి నుంచి నగలు, 2000 సింగపూర్ డాలర్ల నగదు, పాస్ పోర్టు, బ్యాంక్ కార్డులు లాగేసుకున్నారు. మరో రోజు మరో మహిళతో రాత్రిపూట ఓ హోటల్‌లో కలిశారు. ఇద్దరు కలిసి ఆ మహిళ నుంచి నగదు, మొబైల్ ఫోన్లు లాక్కెళ్లారు. పోలీసులు నిందితులను పట్టుకుని కోర్టుకు అప్పగించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)