గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం నుంచి నెల్లూరు జిల్లా రామయ్య పట్నం వరకు భారీ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. దీంతో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈ ప్రాజెక్టుకు గాను రూ.21,800 కోట్లు మంజూరు చేయడానికి అనుమతించింది. ఈ కొత్త గ్రీన్ ఎనర్జీ కారిడార్ లైన్లు పూర్తయితే రాయలసీమ ప్రాంతంలో సోలార్, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు సులభంగా తరలించేందుకు వీలవుతుంది. ఇది రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ పంపిణీ వ్యవస్థకు, పునరుత్పాదక ఇంధన వినియోగానికి ఎంతగానో దోహదపడనుంది. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా  చేపట్టనున్నాయి. ఈ ప్రాజెక్టు వ్యయంలో 30% గ్రాంట్ కింద నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మిగిలిన 70 శాతం ఏపీ ట్రాన్స్ కో భరించనుంది. డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3 కింద ఈ ప్రాజెక్టు చేపట్టాలని కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. దీనికి మొత్తం 28 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రూ.21,800 కోట్లతో ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)