తమ నౌకాదళం గాజా నుండి 150 నాటికల్ మైళ్లు (278కి.మీ) దూరంలో ఉన్న హైరిస్క్ జోన్‌లోకి ప్రవేశించిందని అంతర్జాతీయ సాయం గ్లోబల్ సుముద్ ప్లోటిల్లా బుధవారం ప్రకటించింది. గతంలో మానవతా సాయంతో బయలుదేరిన నౌకలపై గతంలో ఇక్కడే ఇజ్రాయిల్ దాడులు జరిపాయని లేదా నిలిపివేశాయని తెలిపింది. నౌకలకు ఎటువంటి హాని జరగకుండా వదిలివేయాలని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక నివేదకురాలు ఫ్రాన్సిస్కా అల్బనీస్, కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో డిమాండ్ చేశారు. అంతర్జాతీయ జలాల గుండా సురక్షితంగా ప్రయాణించేలా ప్లోటిల్లాకు రక్షణగా స్పెయిన్ మరియు ఇటలీ ఓడలు ప్రయాణిస్తున్నాయి. మరోవైపు టర్కీ డ్రోన్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. నౌకలు గాజా సమీపంలోకి చేరుకోవడంతో , అందులో ప్రయాణిస్తున్న వారి భద్రత కోసం సుముద్ నౌకాదళం ప్రత్యక్ష వీడియోను అందుబాటులో ఉంచింది. ఫ్లోటిల్లాకు తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఇటలీ ప్రకటించింది. ఇజ్రాయిల్ దాడులు, ఆంక్షలతో అల్లాడుతున్న గాజా ప్రజానీకానికి మానవతాసాయం అందించేందుకు అంతర్జాతీయ బృందం గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా సెప్టెంబర్ ప్రారంభంలో బయలుదేరింది. గాజాలోకి నౌకల ప్రవేశాన్ని ఏవిధంగా నైనా అడ్డుకుంటామని ఇజ్రాయిల్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.
గాజా సమీపంలోని హైరిస్క్ జోన్‌లోకి 'గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా'
October 01, 2025
0
Tags