కలబంద గుజ్జు - ఆరోగ్య ప్రయోజనాలు

Telugu Lo Computer
0


లబంద గుజ్జును కాస్మోటిక్స్ లోను, ఫుడ్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తయారు చేయడంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మొక్కలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. చర్మం కోమలంగా ఉండేలా మార్చే గొప్ప గుణం కలబంద కు ఉంది. కలబంద 96% నీటిని కలిగి గుజ్జుగా ఉంటుంది. ఇది అన్ని రకాల వాతావరణంలోనూ పెరుగుతుంది. అలోవెరా గుజ్జును మనం జుట్టుకు కూడా అప్లై చేసుకోవచ్చు. కొబ్బరినూనె, అలోవెరా జెల్ జుట్టుకు బాగా పట్టిస్తే తలలో ఉన్న చుండ్రు పోవడంతో పాటు, మృత కణాలు తొలగిపోయి, జుట్టు నున్నగా మారుతుంది. జుట్టు మెరుస్తూ స్మూత్ గా తయారవుతుంది. జుట్టు రాలిపోయే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కలబంద గుజ్జును ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. స్నానం చేసే ముందు అలోవెరా గుజ్జుతో ఒళ్లంతా రుద్దుకుని, ఐదు నిమిషాల తర్వాత స్నానం చేస్తే చర్మం శుభ్రంగా క్లీన్ అవుతుంది. సబ్బుతో అవసరం ఉండదు. బిపి, షుగర్ వంటివి తగ్గడానికి కలబంద బాగా ఉపయోగపడుతుంది. రోజుకు రెండు స్పూన్ల కలబంద జ్యూస్ తాగితే బీపీ, షుగర్ రెండు కంట్రోల్లోకి వస్తాయి. కలబంద మలబద్దకాన్ని నివారిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కణాల క్షీణతను తగ్గిస్తుంది. గాయాలు త్వరగా నయం కావడానికి దోహదం చేస్తుంది. కలబంద హానికరమైన రోగాలు రాకుండా కాపాడుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)