ఉత్తర కొరియా భారీ ఆయుధ కవాతు నిర్వహించింది. త్వరలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కిమ్ కూడా తన బలాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. శుక్రవారం ప్యోంగ్యాంగ్‌లో పాలక వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 80వ వార్షికోత్సవం సందర్భంగా భారీ కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంతో కిమ్ తన ఆత్మవిశ్వాసాన్ని చూపించారు. సంవత్సరాల తరబడి ఒంటరితనం, ఆంక్షల తర్వాత ప్రపంచ వేదికపై ఉత్తర కొరియా శక్తిని ప్రదర్శించేందుకు ప్రయత్నించినట్లు కనిపించింది. ఈ ప్రదర్శనలో చైనా, రష్యా, వియత్నాంలకు కిమ్ ఆతిథ్యం ఇచ్చారు. అత్యంత సీనియర్ చైనా అధికారి కియాంగ్, మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ నేతృత్వంలోని రష్యన్ ప్రతినిధి బృందం, దాదాపు 20 సంవత్సరాల్లో ప్యోంగ్యాంగ్‌ను సందర్శించిన మొట్టమొదటి అగ్ర నాయకుడు, వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్ లామ్, లావోస్ అధ్యక్షుడు థాంగ్‌లౌన్ సిసౌలిత్ పాల్గొన్నారు. దక్షిణ కొరియాలో జరిగే ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్ ఈనెలలో రానున్నారు.
భారీ ఆయుధ కవాతు నిర్వహించిన ఉత్తర కొరియా
October 11, 2025
0
Tags