అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025' సేల్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 పై ప్రకటించిన తగ్గింపు అతిపెద్ద ఆకర్షణగా నిలిచింది. ఈ అత్యంత ఖరీదైన ఫోల్డబుల్ ఫోన్ ధర ఏకంగా రూ.63,000 వరకు తగ్గింది. శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ప్రారంభ ధర రూ.1,64,999. అమెజాన్ సేల్‌లో ఈ ఫోన్ ధరను ఏకంగా రూ.1,03,999గా జాబితా చేశారు. అంటే, సంస్థ ఏకంగా రూ.61,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తోంది. దీనికి తోడు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.2,000 తగ్గింపు పొందవచ్చు. ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే మొత్తం రూ.63,000 తగ్గింపు లభిస్తుంది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే, దాని కండిషన్‌ను బట్టి అదనంగా రూ.44,050 వరకు విలువ పొందవచ్చు. ఇది 6.3-అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లే, 7.6-అంగుళాల అతి పెద్ద అంతర్గత AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. రెండూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తాయి. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 (Snapdragon 8 Gen 3) చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్, 12జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. 4,400mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కెమెరాలు వెనుక భాగంలో 50MP ప్రధాన సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 10MP, 4MP కెమెరాలు ఉన్నాయి.
అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025' సేల్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6పై డిస్కౌంట్ ఆఫర్ !
October 12, 2025
0
Tags