దేశీయ మార్కెట్లో రియల్ మీ 15ఎక్స్ 5జీ విడుదలైంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8GB RAM + 10GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది. ఇది 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. దీనికి 7000mAh బ్యాటరీ అందించారు. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999, 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999, 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. ఆక్వా బ్లూ, మెరైన్ బ్లూ, మెరూన్ రెడ్ కలర్‌లలో లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక సైట్, మెయిన్‌లైన్ స్టోర్‌లలో సేల్‌కు అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.1,000 బ్యాంక్ ఆఫర్ లేదా రూ.2,000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక సైట్‌లో రూ.3,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఇంకా 6 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను లభిస్తున్నాయి.దీనిలో 6.8-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే, 1570×720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 6nm ప్రాసెసర్‌తో ఆర్మ్ మాలి-G57 MC2 GPUతో వస్తుంది. Realme 15X 5G.. 6GB/8GB LPDDR4X RAM + 128GB/256GB UFS 2.2 స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ Android 15 ఆధారంగా Realme UI 6.0పై నడుస్తుంది. దీని వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. Realme 15X 5G.. 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 + IP69 రేటింగ్ ఉంది. దీనితో పాటు ఇది మిలిటరీ-గ్రేడ్ మన్నిక కోసం MIL-STD 810H సర్టిఫికేషన్‌తో వస్తుంది.
రియల్ మీ 15 ఎక్స్ 5జీ విడుదల
October 01, 2025
0
Tags