హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు చెందించారు. నిందితులు ఇద్దరినీ రాంచీలో కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ముందు మెదక్ తుప్రాన్‌లో ఒక ఫాం హౌస్ లో హర్ష గ్యాంగ్ పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలో మొత్తం తొమ్మిది మందిని పోలీసులు గుర్తించారు. ఇందులో నిఖిల్ అనే వ్యక్తిని ఢిల్లీ ఫరిధాబాద్ లో పోలీసులు పట్టుకున్నారు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు మొత్తం కేసును ఛేదించారు. హైదరాబాద్ లో కొండాపూర్ నుంచి రాంచీ క్యాబ్ బుక్ చేసుకున్న హర్ష సంఘటన జరిగిన రోజే బయల్దేరారు. రాంచీలో వాళ్ళను డ్రాప్ చేసి వస్తున్న సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి వెంటనే పోలీసులకు క్యాబ్ డ్రైవర్ సమాచారం ఇచ్చాడు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కూకట్‌పల్లి రేణు మర్డర్ కేసును చేధించిన పోలీసులు : ఇద్దరు నిందితులు అరెస్ట్
September 13, 2025
0
Tags