కర్నాటకలోని బెంగుళూరులో ఓ మహిళను12 ఏళ్ల కూతురు ముందే ఆమె భర్త పొడిచి చంపాడు. బాధితురాలను రేఖగా, నిందితుడిని లోహితస్వగా పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరూ కొన్నాళ్లు సహజీవనం చేశారు. మూడు నెలల క్రితమే వాళ్లు పెళ్లి చేసుకున్నారు. దీనికి పూర్వమే రేఖ గతంలో పెళ్లి చేసుకున్నది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భర్త నుంచి ఆమె వేరుగా ఉంటోంది. లోహితస్వ కూడా విడాకులు తీసుకున్న వ్యక్తే. అయితే రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ కలిసి ఉంటున్నారు. రేఖ పెద్ద కూతురు ఆమెతోనే ఉంటోంది. చిన్న కూతురు మాత్రం రేఖ తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత రేఖ, లోహితస్వ కర్నాటకలోని సిర పట్టణం నుంచి బెంగుళూరుకు మకాం మార్చారు. తాను జాబ్ చేస్తున్న కాల్ సెంటర్‌లోనే రేఖ తన భర్తకు డ్రైవర్ ఉద్యోగం ఇప్పించింది. కానీ కొన్నాళ్ల నుంచి రేఖపై భర్తకు అనుమానాలు పెరిగాయి. మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంన్నందుకు ఆగ్రహించాడు. బస్ స్టాప్ వద్ద కూతురితో కలిసి వేయిటింగ్ చేస్తున్న రేఖపై లోహితస్వ కత్తితో పొడిచేచి పరార్ అయ్యాడు. స్థానికలు ఆమెను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. కామాక్షీపాల్యా పోలీసు స్టేషన్‌లో మర్డర్ కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.
అనుమానం పెనుభూతమై కూతురు ఎదుటే భార్యను పొడిచి చంపిన భర్త !
September 23, 2025
0
Tags