హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కవిత ఎన్నిక

Telugu Lo Computer
0


సింగరేణి వర్కర్స్ యూనియన్ కు చెందిన హెచ్ఎంఎస్ (హింద్ మజ్దూర్ సభ) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మాద్ ఆమె పేరును ప్రతిపాదించారు. దీంతో ఏకగ్రీవంగా ఆమె ఎన్నికయ్యారు. అమెరికా పర్యటనను ముగించుకున్న కవింత సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ కు రానున్నారు. ఇటీవల తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షురాలి పదవి నుంచి కవితను బీఆర్ఎస్ తొలగించిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు బాధ్యతలు అప్పగించింది. ఇది జరిగిన కొన్నిరోజులకే తాజాగా హెచ్ఎంఎస్ అధ్యక్షురాలిగా కవిత ఎన్నిక కావడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)