ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. ఆ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను కూటమి నాయకుడిగా, సభలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తానని, ఇలాంటి ఎపిసోడ్లు రిపీట్ కాకూడదని ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుధీర్ రెడ్డి, బొండా ఉమా, బూర్ల ఆంజనేయులకు క్లాస్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, విప్‌లపై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించగా, అదే సందర్భంలో పవన్ కల్యాణ్, నాగబాబు మాత్రం మౌనం దాల్చడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి పాలనలో ఒక వైపు అన్నయ్య చిరంజీవి, మరో వైపు కూటమి నాయకుడు బాలకృష్ణ ఉండటంతో పవన్ కల్యాణ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. చిరంజీవి అభిమానులు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిరసనలకు సిద్ధమవుతున్నారు. రేపు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం ఈ వివాదం తీవ్రతను సూచిస్తోంది.
బాలకృష్ణ వివాదంపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు ?
September 27, 2025
0
Tags