హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం, షేక్‌పేట సమతా కాలనీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ పర్యటించారు. ఇంటింటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీ ఏమైంది.? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అన్నివర్గాలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. ఫోర్త్ సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనపై కేటీఆర్ విమర్శలు చేశారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని కోరారు. ఫోర్త్ సిటీ కాదు, ఉన్న సిటీని సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. మెట్రోను రద్దు చేసి, ఫోర్త్ సిటీకి మెట్రో అంటున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫోర్త్ సిటీ అంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు.
కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది : మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
September 28, 2025
0
Tags