ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణం నుంచి గత మంగళవారం దాదాపు కోటి రూపాయల విలువైన కలశం ఎత్తుకెళ్లారు. ఎర్రకోట ప్రాంగణంలో జరిగిన మతపరమైన వేడుక సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కలశం దాదాపు 760 గ్రాముల బంగారంతో తయారు చేశారు. దానిపై దాదాపు 150 గ్రాముల వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలు పొదిగి ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకుని పరిశీలించారు. కేసు నమెదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. నిందితుడిని గుర్తించామని త్వరలో అతన్ని అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ కేసులో ఇండియన్ పీనల్ కోడ్, 2023 లోని సెక్షన్ 303(2) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఎర్రకోటలో కోటి రూపాయల విలువైన కలశం దొంగలించిన దుండగులు
September 06, 2025
0
Tags