అక్టోబర్‌ 5 వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

Telugu Lo Computer
0


ముంబయి పోలీసులు వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్న వేళ కీలక ఆదేశాలు జారీ చేశారు. భద్రతాపరమైన ఆందోళనల కారణంగా ముంబయి వీధుల్లో డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్‌తో నడిచే మైక్రోలైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హాట్ ఎయిర్‌బెలూన్లు ఎగురవేయడంపై నిషేధం విధించారు. సెప్టెంబర్‌ 6 నుంచి అక్టోబర్‌ 5 వరకు మొత్తం 30 రోజులు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని అధికారులు వెల్లడించారు. వినాయక నిమజ్జనాలు కొనసాగుతుండటం, త్వరలో దసరా నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 6న గణనాథుడి నిమజ్జనం సందర్భంగా నగరంలో భారీ జనసమూహం ఉంటుందని అంచనా వేశారు. దీంతో నగరంలో శాంతి భద్రతలను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పలు ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేసినట్లు తెలిపారు. డ్రోన్లు, పారాగ్లైడర్లు వంటి ఎగిరే వస్తువుల ద్వారా ఎలాంటి విధ్వంసం జరగకుండా ఈ ఆంక్షలు విధించామని.. వాటిని ఉల్లంఘించినవారు శిక్షార్హులన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)