సరోగసి ముసుగులో కోట్లు వసూలు చేసిన డాక్టర్ నమ్రత !

Telugu Lo Computer
0


రోగసి ముసుగులో పదేళ్ల పాటు డాక్టర్ నమ్రత బ్యాచ్ కోట్లు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలకు సరోగసి కోసం వచ్చే దంపతుల వివరాలను వేరువేరు రికార్డులుగా నమ్రత మెయింటైన్ చేసినట్లు దర్యాప్తు బృందం తెలిపింది.అంతేకాకుండా, నగదు లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను నమ్రత తనకు పనిచేసే సిబ్బంది పేరుతో ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు అంచనా వేస్తున్నారు. ఈ వివరాల నేపథ్యంలో నమ్రతను మరొకసారి కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సిసిఎస్ అధికారులు వెల్లడించారు. సృష్టి ఫెర్టిలిటీ కేసు సంచలనంగా మారడంతో ప్రభుత్వం, పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)