ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్ అనే మహిళ తన భర్త ప్రదీప్‌తో కలిసి ఆదివారం సాయంత్రం కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్‌కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీకెళ్లాలనుకుంది. అయితే కారును నిమ్మకాయ తొక్కించి బయటకు తేవాలనుకుంది. ఈలోపు పొరపాటును ఎక్సలేటర్‌ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్‌ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ఆ కారు ధర రూ. 27 లక్షలుగా తెలుస్తోంది. అయితే మరికొన్ని మీడియా చానెల్స్ మాత్రం మరోలా కథనాలు ఇస్తున్నాయి. షోరూం సిబ్బంది ఆ భార్యభర్తలకు డెమో ఇచ్చే టైంలో ప్రమాదం జరిగిందని ప్రసారం చేస్తున్నాయి. డెమో ఇచ్చే టైంలో ఆ సిబ్బంది కారు ఇంజిన్ ఆన్ చేశాడని, హఠాత్తుగా ఆ మహిళ ఎక్సలేటర్ తొక్కడంతో కారు బయటకు దూసుకొచ్చిందన్నది ఆ కథనం సారాంశం. ఏదిఏమైనా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు వ్యంగ్యంగా స్పందిస్తుననారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించాలంటూ పలువురు నెటిజన్లు కోరుతుండడం గమనార్హం.
ఎక్సలేటర్‌ను బలంగా తొక్కడంతో 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద పడ్డ కొత్త కారు : వీడియో నెట్టింట వైరల్
September 10, 2025
0
Tags