చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో సమావేశం ప్రారంభానికి ముందు మోడీ-పుతిన్ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అనంతరం గ్రూప్ ఫొటో సెషన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా కాసేపు చర్చించారు. ఈ సమయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పక్కనే ఉన్నా, మోడీ అతన్ని పట్టించుకోకపోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక సమావేశం ముగిసిన తర్వాత మోడీ-పుతిన్ ఒకే కారులో ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ దృశ్యాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్నందుకు అమెరికా ఇప్పటికే తీవ్రంగా స్పందిస్తున్న తరుణంలో, మోడీ-పుతిన్ కలిసి ప్రయాణించడం అంతర్జాతీయ స్థాయిలో మరింత చర్చనీయాంశమైంది. ఇటీవల పుతిన్-ట్రంప్ అలాస్కాలో భేటీ అయ్యారు. దానిపై మోడీ-పుతిన్ ఇప్పటికే ఫోన్‌లో చర్చించుకున్నారు. ఇప్పుడు ముఖాముఖిగా కలుసుకుని ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపై, దానిని పరిష్కరించేందుకు భారత్-చైనా చేసిన ప్రయత్నాలపై చర్చించారు. ఆసియా దేశాల కృషిని పుతిన్ ప్రశంసించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశంలో 20కి పైగా దేశాధినేతలు, 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. భద్రతా సమస్యలు, ఆర్థిక సహకారం, గ్లోబల్ సౌత్ దేశాల స్వరాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.
ఒకే కారులో మోడీ-పుతిన్ : సోషల్ మీడియాలో వైరల్
September 01, 2025
0
Tags