రష్యాలో కార్ల పార్కింగ్‌ ప్రాంతంలో ఎలుగుబంటి దాడి : వృద్ధురాలు మృతి

Telugu Lo Computer
0


ష్యాలోని పెట్రోపావ్‌లోవ్‌స్కీ-కామ్చాటీస్కీలో కార్లు నిలిపిన పార్కింగ్‌ ప్రాంతం వద్దకు పెద్ద ఎలుగుబంటి వచ్చింది. అక్కడున్న జనంపై అది దాడి చేసింది. గాయపడిన ఒక వృద్ధురాలు మరణించింది. ఈ నేపథ్యంలో ఆ ఎలుగుబంటిని కాల్చి చంపారు. వరుసగా కార్లు పార్క్‌ చేసిన ప్రాంతంలో అకస్మాత్తుగా పెద్ద ఎలుగుబంటి కనిపించింది. అక్కడున్న వ్యక్తులపై అది దాడి చేసింది. ఎలుగుబంటి దాడి నుంచి 12 ఏళ్ల బాలుడు తృటిలో తప్పించుకున్నాడు. వెంటనే కారులోకి ఎక్కి డోర్‌ మూసేశాడు. మరో వ్యక్తి కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఎలుగుబంటి దాడిలో గాయపడిన 84 ఏళ్ల వృద్ధురాలు మరణించింది. మరోవైపు పోలీసులు, అధికారులు అలర్ట్‌ అయ్యారు. ఒక స్కూల్‌ వద్ద ఆ ఎలుగుబంటిని కాల్చి చంపారు. అయితే ఆ ఎలుగుబంటి సృష్టించిన భయాందోళన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)