టస్కర్ వాహనం కింద పడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి

Telugu Lo Computer
0


వినాయక నిమజ్జన విధుల్లో వున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు టస్కర్ వాహనం కిందపడి మృతి చెందింది.  గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక. ఈరోజు  ఉదయం బషీర్ బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే మార్గంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డును దాటేందుకు యత్నించారు. అదే సమయంలో బషీర్ బాగ్ నుంచి వస్తున్న వినాయకుడు ఉన్న టస్కర్ వాహనం రేణుకను బలంగా ఢీ కొట్టింది . దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేణుక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. టస్కర్ వాహనం డ్రైవర్ గజానంద్‌ను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ గజానంద్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)