ధార్మిక సంస్థలకు, ప్రభుత్వానికి తేడా తెలుసుకుని మాట్లాడాలి : యామినీ శర్మ

Telugu Lo Computer
0


క్తులు హుండీలో వేసే ముడుపులతో సేవచేసే ధార్మిక సంస్థలకు, ప్రజలు చెల్లించే పన్నులతో నడిచే ప్రభుత్వానికి తేడా తెలుసుకుని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మాట్లాడాలని భాజపా అధికార ప్రతినిధి యామినీశర్మ హితవు పలికారు. తితిదే ద్వారా దళిత వాడల్లో మరో ఐదు వేల వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పగానే షర్మిల సమాజసేవ, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐదు వేలు కాదు, 50వేల ఆలయాలు కట్టుకుంటాం. వాటి గురించి మాట్లాడడానికి మీకేం హక్కు ఉందని ప్రశ్నించారు. భక్తులు ఇచ్చిన నిధులను తితిదే ధూపదీప నైవేద్యాల కోసం, ధార్మిక వ్యాప్తికోసం ఖర్చుపెడుతోంది. హిందూ ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ సొమ్ములు తీసుకోవడం లేదు. ప్రభుత్వమే దేవాదాయ శాఖ ద్వారా ఆలయాల నుంచి పన్నుల వసూలు చేస్తోంది. తితిదే ఇప్పటికే ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తోందని ఆమె గుర్తుచేశారు. అంత ప్రేమ ఉంటే మీ ఆస్తులు మొత్తం సమాజానికి ఇవ్వాలని షర్మిలకు సూచించారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ గురించి మాట్లాడే హక్కు ఆమెకు లేదని, కాంగ్రెస్‌ పార్టీ దశాబ్దాలుగా దళితులను ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)