ఆపమన్న చోట బస్సు ఆపలేదని డ్రైవర్‌పై మహిళా ప్రయిణికురాలు దాడి !

Telugu Lo Computer
0


బెంగళూరులో ఆపమన్న చోట బస్సు ఆపలేదని డ్రైవర్‌పై మహిళా ప్రయాణికులు వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. అంతే వేగంగా డ్రైవర్ కూడా ఎటాక్ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగళూరులోని పీన్యా సమీపంలో తమకూరు రోడ్డులో బస్సు డ్రైవర్-మహిళా ప్రయాణికురాలి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం భౌతిక దాడులకు పాల్పడ్డారు. మాటలతో మొదలైన గొడవ అనంతరం ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన గొడవను బయట నుంచి ఒక వ్యక్తి మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోలో మహిళా ప్రయాణికులకు సహాయంగా తోటి ప్రయాణికులు కూడా తోడయ్యారు. అనంతరం కండక్టర్ కలుగజేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)