ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మైనర్ బాలికను హత్య చేశాడో కసాయి తండ్రి. ఐదు రోజుల క్రితం బాలిక మిస్సింగ్ పై బందువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు నిజాలు బయటపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిందే బాజీ(46) రెండు వివాహాలు చేసుకుని మైలవరం శుద్దిపేట ప్రాంతంలో నివాసముంటున్నాడు. మొదటి భార్య ద్వారా ఐదుగురు ఆడపిల్లలు, రెండవ భార్యకు ఒక ఆడపిల్ల జన్మించింది. రెండవ భార్యతో వివాహం తర్వాత మొదటి భార్య విడిగా ఉంటుంది. బాజీ రెండవ భార్యతో కలిసి గంజాయి విక్రయాలు చేపట్టి ఆ కేసులో జైలుకెళ్ళారు. అయితే తన భార్యఇంకా జైల్లోనే ఉండగా ఇటీవలే విడుదలైయ్యాడు. ఇటీవల తన కుమార్తె ఒక యువకుడితో ప్రేమలో పడిందని గమనించి బాజీ హెచ్చరించిన వినకపోవడంతో ఇంట్లోనే తన ఐదుగురు కుమార్తెల సమక్షంలోనే గాయత్రి పై ఐరన్ రాడ్ తో దాడికి పాల్పడ్డాడు. రెండవ భార్య కుమార్తె మరణించడంతో నెత్తుటి మరకలు పోవడానికి గదిని కుమార్తెలు బ్లీచింగ్ తో శుభ్రం చేసారు. మృతి చెందిన బాలిక ఆచూకీ కోసం, బాజీ ఆచూకి కోసం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రేమించిన నేరానికి కూతుర్ని బలితీసుకున్న తండ్రి
September 11, 2025
0
Tags